మీ కంప్యూటర్ నుంచే రేడియో వినండి..
(Listen to the radio on your computer)
ఏ కంప్యూటర్‌కైనా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు... దీనిని గ్లోబల్ రేడియో రిసీవర్‌గా మార్చుకోవడం చాలా తేలిక. ఇక మీకు కావలసిందల్లా కొంత సాఫ్ట్‌వేర్ మరియు కొన్ని చిట్కాల తోడ్పాటు. దాంతో లైవ్ రేడియో లేదా స్ట్రీమింగ్ రేడియో ప్రసారాల్ని ఆస్వాదించవచ్చు.
అసలు ఈ ఏమిటీ Internet radio ?
ప్రపంచవ్యాప్తంగా చాలా radio స్టేషన్లుండగా, చాలామంది వ్యక్తులు Internet radio స్టేషన్లను కూడా సృష్టించారు. వీటినే వెబ్ రేడియోలంటారు. ఇంకా National Public Radio, CBC, ChoiceRadio, SHOUTcast లాంటివి చాలానే ఉన్నాయి. రియల్ టైం ప్రసారాలు లేదా కావలసినప్పుడు వినడం కోసం సిద్ధం చేసి ఉంచిన ప్రసారాలు ఇలా అందుబాటులో ఉన్నాయి.
మీదగ్గర ఏమేం ఉండాలి ?
Online రేడియో ప్రసారాల్ని మీ కంప్యూటర్ నుంచి వినడానికిగాను Windows Media Player లాంటి ఒక ప్లేయర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది Windows 7 మరియు Windows Vista ఆపరేటింగ్ సిస్టంలలో ముందుగానే ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. ఇంటర్నెట్ రేడియో ప్రసారాలు డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలుగా RealPlayer cjf/g QuickTime ఫార్మాట్లలో ఉంటాయి.
Windows Media Player ద్వారా పలు రేడియో స్టేషన్లను సులభంగా అన్వేషించి వివిధ ప్రసారాల్ని ఆస్వాదించవచ్చు. మీ మనసును దోచే రకరకాల పాటలను వర్గీకరించి అందిస్తూ custom-built playlistsతో కూడిన డజన్లకొద్దీ రేడియో స్టేషన్లు మీకు అందుబాటులో ఉంటాయి.
Internet radioలోని ఒక గొప్ప విషయం ఏమిటంటే.. దీని ద్వారా మీరు ఆనందించే సంగీతమంతా ఉచితమే. ఎప్పుడు కావాలంటే అప్పుడు వినచ్చు. కాకపోతే ఒక అకౌంట్ తెరవడం, ఇ-మెయిల్ చిరునామా ఇవ్వడం లాంటివి ఉంటాయంతే. ఇవే కంపెనీలు కొద్దిపాటి రుసుముతో వాటి శ్రోతలకు ప్రత్యేక ప్యాకేజీల్ని ఆఫర్ చేస్తుంటాయి. అవి మరింత నాణ్యతతో higher bit rate ప్రసారాలని, ప్రత్యేక ప్రసారాలని, Commercial-free listening అని ఇలా...
మరికొన్ని Internet radio స్టేషన్లు ఇంకో అడుగు ముందుకేశాయి. Pandora.com లాంటి కొన్ని సైట్లయితే శ్రోతలకు నచ్చిన సంగీతవేత్త, గీతరచయిత లేదా పాటల ఆధారంగా రేడియో స్టేషన్‌ను (playlist తరహాలోనే) రూపోందించి ఆకట్టుకుంటున్నాయి. మీరు చెయ్యాల్సిందల్లా ఉచితంగా నమోదు చేసుకోవడమే...
ఇదిలా ఉండగా, పలు మ్యూజిక్ స్టేషన్ల వెబ్ సైట్ల ద్వారా రియల్ టైంలోనే ప్రసారాల్ని ఆస్వాదించవచ్చు. మీరెక్కడున్నప్పటికీ Bing.com నుంచి శోధించడం ద్వారా ఒక లోకల్ రేడియో స్టేషన్‌ను కనుగొని ప్రసారాలు వినవచ్చు. ఆ స్టేషన్‌కు సంబంధించిన కాల్ సైన్ టైప్ చేసి (ఉదా.. 94.9), సదరు వెబ్ సైట్ లభించగానే Listen Live లేదా Streaming అని ఉన్న లింక్ ద్వారా సంగీత ప్రసారాల్ని తనివితీరా ఆనందించగలుగుతారు. మీరు మంచి సంగీత ప్రియులు కనుక ప్రసార నాణ్యతలో రాజీపడకుండా మంచి స్పీకర్లు లేదా హెడ్ ఫోన్లను ఉపయోగించుకోండి.