Microsoft Office 2010తో సహకారంలో సమన్వయం

 

అత్యంత ప్రజాదరణ పొందిన Microsoft సంస్థ సుప్రసిద్ధ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులైన Microsoft Office 2010, Microsoft SharePoint Server 2010, Microsoft Visio 2010 మరియు Microsoft Project 2010 ఎంతో ముఖ్యమైన టెక్నికల్ ప్రివ్యూ మైలురాయిని అందుకున్నాయి. ఇందులో భాగంగా Office మరియు Visioలను పరీక్షించేందుకు వేలాదిమందికి ఆహ్వానం అందుతుంది.

 

Office 2010 అనేది నేడు PCలు, మొబైల్ ఫోన్లు, బ్రౌజర్ల వెంబడి అత్యంత ప్రధానమైన ప్రొడక్టివిటీ సొల్యూషన్‌గా నిలిచిందని Microsoft వాణిజ్య విభాగం వ్యాఖ్యానించింది. PowerPointలో బ్రాడ్‌కాస్ట్ మరియు వీడియో ఎడిటింగ్, Excelలో డేటా విజువలైజేషన్, Wordలో co-authoring ఇలా యూజర్ల తమ కార్యకలాపాలను ఎక్కడి నుంచైనా, ఎలాంటి పరికరం ద్వారా అయినా వేగంగాను, సులభంగాను, కచ్చితంగాను నిర్వహించుకోగలిగేలా సాంకేతిక సహకారాన్ని పొందవచ్చని ఈ విభాగపు ఉన్నతాధికార్లు పేర్కొన్నారు.

 

Office 2010 మరియు సంబంధిత సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు తమ యూజర్లకు వినూత్నమైన సామర్థ్యాలను అందించి, సరికొత్త సౌలభ్యాలతో మరిన్ని జవసత్వాలను అందిస్తున్నాయి. ఇందులోని కీలక అంశాలు ఏమిటంటే..

* ఎక్కడి నుంచైనా కార్యకలాపాల నిర్వహణ:

ఎలాంటి పరికరం నుంచయినా మీ డాక్యుమెంట్ సౌందర్యాన్ని యథాతథంగా చూపేందుకు Word, PowerPoint, Excel మరియు OneNoteలోని lightweight Web బ్రౌజర్ వెర్షన్‌లు తోడ్పాటునిస్తాయి.

*  సహకారంలో మెరుగైన సమన్వయం:

Microsoft Word 2010, Microsoft PowerPoint 2010 మరియు Microsoft OneNote 2010లోని co-authoring సదుపాయం వల్ల ఆయా సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించే వారి మధ్య పరస్పర సహకారం మరింత సమన్వయంతో సాగుతుంది. Microsoft Outlook 2010లోని అత్యాధునిక ఇ-మెయిల్ నిర్వహణ, క్యాలెండరింగ్ సామర్థ్యాలను ఉపయోగించుకుని అవాంఛిత threadsను పక్కనపెట్టవచ్చు.

* Microsoft PowerPoint 2010లోని వీడియో మరియు పిక్చర్ ఎడిటింగ్, బ్రాడ్‌కాస్టింగ్ సౌకర్యంతో జ్ఞాపకాల్ని జీవితకాలం పదిలపరుచుకోవచ్చు. Microsoft Office Backstage view ద్వారా మీ డాక్యుమెంట్ రూపకల్పన మరింత సులభతరమవుతుంది. Microsoft Excel 2010లోని సరికొత్త Sparklines తోడ్పాటుతో డేటా విజువలైజేషన్, ట్రెండ్స్ గుర్తింపు కార్యకలాపాల్ని త్వరితగతిన పూర్తి చేసుకోవచ్చు.

 

Office వెబ్ అప్లికేషన్లను Microsoft సంస్థ మూడు మార్గాల్లో మనకు అందుబాటులోకి తీసుకువచ్చింది. సుమారు 400 మిలియన్ల మందికి పైగా వినియోగదారులున్న Windows Live నుంచి ఏ మాత్రం వ్యయం లేకుండానే Office వెబ్ అప్లికేషన్లను యాక్సెస్ చేసుకోవచ్చు. Office వాల్యూమ్ లైసెన్సింగ్ ఖాతాదారులు, Office annuity ఖాతాదార్లుకు on-premises ద్వారా, Microsoft Online Services ద్వారా హోస్టెడ్ ఆఫరింగ్‌లో భాగంగా ఒక చందా సేవను కొనుగోలు చేయడం ద్వారా వీటిని పొందవచ్చు.

Read More on...