సంప్రదింపులకు సరైన మార్గం Office Communications Online
ఎప్పటికప్పుడు సందేశాల్ని పంపించడానికి అనుగుణంగా instant messaging (IM), PC-to-PC ఆడియో మరియు వీడియో కాలింగ్ సదుపాయాలతో మీ సంస్థ భవిష్యత్తు అవసరాలకు తగిన కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని అందించే అత్యాధునిక సంప్రదింపుల వ్యవస్థ ఈ Microsoft Office Communications Online. ప్రత్యేకించి Microsoft Outlook మరియు Microsoft SharePoint Serverలతో అనుసంధానమై వినూత్నమైన "click-to-communicate" అనుభవాన్ని మీ స్వంతం చేస్తుంది. అందరూ మీ చెంతనే ఉన్నంత అనుభూతి చెందగలరనడంలో అతిశయోక్తిలేదు.
మీ వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన సత్వర నిర్ణయాల్ని తీసుకోవడానికి, సంస్థ కార్యకలాపాల్లో జాప్యానికి తావులేకుండా ముందస్తు ప్రణాళికకు అనుగుణంగా కార్యకలాపాల నిర్వహణకు గాను ఎప్పటికప్పుడు సంప్రదింపులు నెరపడానికి, కీలకమైన లేదా సంక్లిష్టమైన పరిస్థితుల్లో అత్యవసర చర్చలకు, సమాచార పంపిణీ తదితర కార్యకలాపాలకు ఈ Office Communications Online వ్యవస్థ విశ్వసనీయమైన సేవలందిస్తుంది.
Office Communications Online కోసం ప్రత్యేకంగా Microsoft Office Communicator 2007 R2ను కూడా కొనుగోలు చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, Office Communications Online కస్టమర్లకు ఒక పరిమితకాల అవకాశం లభించింది. అదేమిటంటే, Office Communications Online ఒకొక్క ట్రయల్ లేదా చందా చెల్లింపు లైసెన్స్‌కూ ఒక Office Communicator 2007 R2 లైసెన్స్‌డ్ కాపీని అదనపు వ్యయమేదీ లేకుండానే అందజేయడం. దీనిని Office Communications Onlineతో మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కాగా, లైసెన్స్ చందా కాలం ముగిసినప్పుడు లేదా భారీ మార్పుచేర్పులతో Office Communications Online తదుపరి వెర్షన్ ఆవిష్కరణ జరిగినప్పుడు (ఏ పరిణామం ముందు జరిగితే అప్పుడు) మాత్రం Office Communicator 2007 R2 వినియోగ హక్కులు ముగుస్తాయి.
సాంకేతిక అవసరాల్ని గమనిస్తే.. Windows Vista సిస్టంలో అయితే 1 gigahertz (GHz) Pentium ప్రాసెసర్ లేదా అంతకంటే వేగమైనది అయి ఉండాలి. 1 గిగాబైట్ (GB) లేదా అంతకంటే ఎక్కువగా సిస్టం RAM ఉండాలి. Windows XP సిస్టంలో అయితే 500 megahertz (MHz) Pentium ప్రాసెసర్ లేదా అంతకంటే వేగవంతమైనది (సిఫారసు 1 GHz) అయి ఉండాలి. 256 MB లేదా అంతకంటే ఎక్కువ సిస్టం RAM ఉండాలి.