సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసే సైబర్ అప్పిల్లేట్ ట్రిబ్యునల్


ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద, కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీ (సిసిఎ) ఆధ్వర్యంలో పనిచేస్తున్న సైబర్ అప్పిల్లేట్ ట్రిబ్యునల్ సైబర్ నేరాలకు సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తుంది. 1908 పౌరపరిపాలనా చట్టం మాదిరిగా సివిల్ కోర్టులకు ఉన్న అధికారాలే ఈ ట్రిబ్యునల్‌కు ఉంటాయని, ఐటి చట్టం కింద ఇది పనిచేస్తుందని ఐటి, ఐటి కమ్యూనికేషన్స్ విభాగం ముఖ్య కార్యదర్శి కె.రత్నప్రభ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

 

ఇతరులకు చెందిన కీలక సమాచారాన్ని (యూజర్ నేమ్స్, పాస్ వర్డ్స్, క్రెడిట్ కార్డ్ తదితర వివరాలు) చౌర్యం చేయడం లక్ష్యంగా సాగే phishing కార్యకలాపాలు, సైబర్ ఫ్రాడ్స్‌గా పేర్కొనే ఇంటర్నెట్ మోసాలు, ఇతరుల కంప్యూటర్ సిస్టమ్‌కు ఏ విధంగానైనా హాని కల్గించే ఉద్దేశ్యంతో malwareను (వైరస్, worms, trojan horses, spyware, dishonest adware, scareware, crimeware వంటి వివిధ రూపాల్లో) చొప్పించటం, సేవలందించేందుకు నిరాకరించడం, ప్రత్యర్థులకు చెందిన సున్నితమైన సమాచారాన్ని నెట్ ద్వారా రహస్యంగా సంగ్రహించే Cyber espionage, ఇతరుల పాస్ వర్డ్‌లను అక్రమంగా సంగ్రహించి, వారి పేరిట చట్ట విరుద్ధంగా online కార్యకలాపాలు నిర్వహించడం లక్ష్యంగా జరిగే identity theft, కాపీ రైట్ హక్కులున్న విలువైన డిజిటల్ సమాచారాన్ని అనుమతి లేకుండా చౌర్యం చేసే data theft కార్యకలాపాలు, Mobile PocketPCలు, Mobile Phone పరికరాలపై జరిగే malware దాడులు, online లాటరీ వచ్చిందని ఊదరగొట్టి సర్వీస్ చార్జీలు దండుకోవటం లాంటి ఆర్థిక నేరాలు, అసలు వివరాలను దాచిపెట్టి, మారుపేరుతో onlineలో అనైతిక వ్యవహారాలు నడిపి, వ్యక్తుల్ని సామూహికంగా మోసగించే లక్ష్యంతో సాగే Social engineering, ఇంటర్నెట్ ద్వారా వైరస్ లేదా మరే ఇతర రూపంలోనైనా కంప్యూటర్ వ్యవస్థలను విచ్ఛినం చేసేలా జరిగే సైబర్ దాడులు (Cyber terrorism), పెద్ద ఎత్తున అవాంఛిత ఇ-మెయిల్స్ పంపటం (స్పామ్) వంటి నేరాలను ట్రిబ్యునల్ విచారిస్తుందని, సైబర్ నేరాల బాధితులు ట్రిబ్యునల్ అధికారిని ఆశ్రయించి విచారణ కోరవచ్చని ముఖ్య కార్యదర్శి ఈ ప్రకటన ద్వారా తెలిపారు.

 

సైబర్ నేరాలకు సంబంధించి ఐటి చట్టం 2000 కింద నమోదైన దాఖలైన ఫిర్యాదులను విచారించటం adjudicating officer బాధ్యత అని, వారు క్షేత్రస్థాయి విచారణ జరుపుతారని ఆ ప్రకటన వెల్లడించింది. Adjudicating officers అందరినీ తమతో అనుసంధానించేందుకు ట్రిబ్యునల్ నిర్ణయించిందని, రోజువారీ కార్యకలాపాలకు విడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహిస్తారని, వివిధ కేటగిరీలలోని సైబర్ నేరాల వల్ల బాధితులైన పౌరులు రాష్ట్ర ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలియజేశారు.

 

మరిన్ని వివరాల కోసం ఆంధ్రప్రదేశ్ సచివాలయం డి బ్లాక్‌లోని (431వ నెంబర్ గది) ఐటి మరియు కమ్యూనికేషన్స్ శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శిని సంప్రదించవచ్చు.


ఫోన్: 040-23456401, ఇ-మెయిల్: prlsecy_itc@ap.gov.in

Read More on...