భారతీయ రూపాయికి సరికొత్త సంకేత చిత్రం...


భారతీయ రూపాయిని ప్రతిబింబించేందుకుగాను సరికొత్త కరెన్సీ సంకేత చిత్రాన్ని వినియోగించనున్నట్లు భారత ప్రభుత్వం జులై 15, 2010న ప్రకటించింది. పలు దేశాల్లో ఇప్పటికీ వాడకంలో ఉన్న అసలు రూపాయి బొమ్మకు అదనంగా ఈ కొత్త సంకేత చిత్రం ఉంటుంది. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖ వారి వెబ్‌సైట్ నుంచి ఈ కొత్త సంకేత చిత్రాన్ని పొందవచ్చు.


ఈ విభాగపు వెబ్‌సైట్: http://india.gov.in/knowindia/currency_symbols.php


Unicode 6.0లో ఈ కొత్త సంకేత చిత్రాన్ని పొందుపరిచేందుకుగాను భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) మంత్రిత్వశాఖ ఇప్పటికే Unicode ప్రమాణాల బృందంతో కలసి పని చేసింది. ఇక keyboardల నుంచి ఈ కొత్త చిత్రాన్ని పొందడానికి సంబంధించిన సమాచారం విడుదల చేస్తుంది.


ఈ కొత్త చిత్రానికి సంబంధించిన సాంకేతిక అంశాలను పూర్తిగా అర్థం చేసుకొని, Microsoft ఉత్పత్తులలో దీనికి తోడ్పాటునిచ్చే వ్యవస్థను సిద్ధం చేసేందుకుగాను భారత ఐటీ మంత్రిత్వ శాఖతో Microsoft బృందం సంప్రదింపులు జరిపింది. వీలైనంత త్వరలో ఈ నూతన రూపాయి సంకేత చిత్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలన్న భారత ప్రభుత్వం మరియు ఐటీ మంత్రిత్వశాఖ లక్ష్యాన్ని Microsoft అందిపుచ్చుకున్నది.


భారతీయ ద్రవ్య వ్యవహారాలు, ఆర్థిక పరిపుష్ఠికి గల అంతర్జాతీయ గుర్తింపును ఈ రూపాయి సంకేత చిత్రం ప్రతిబింబిస్తుంది. ఐఐటి, బాంబే నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ (డిజైన్) అయిన ఉదయకుమార్ దీని రూపశిల్పి.