Microsoft Office 2010 ఫైళ్ళు, మేక్రోల పొంతన
పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో మీరు Microsoft Office 2010ను ఉపయోగించాలని నిర్ణయించుకున్నప్పుడు, ప్రస్తుతమున్న మీ Office ఫైళ్ళు, మేక్రోల మధ్య ఏ మేరకు పొంతన (compatibility) ఉందో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పిడి (Office 2010కు మారడం) క్రమంలో మీకు ఎదురయ్యే అవకాశమున్న ఇబ్బందుల నుంచి ముందుగానే గట్టెక్కేందుకు సహాయపడేలా Microsoft Office విభాగం Office Migration Planning Manager 2010 (OMPM)ను సిద్ధం చేసింది. దీనిని ఉపయోగించుకుని Office 2010కు మారే ప్రక్రియను సులభతరం చేసుకోవచ్చు.
ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ OMPM 2010ను Microsoft డౌన్‌లోడ్ సెంటర్ నుంచి పొందండి.
Office ఏర్పాటు కార్యకలాపాల్ని పర్యవేక్షించే IT నిపుణులకు సహకారం అందించడం కోసం ఈ OMPMను రూపొందించారు. ప్రస్తుత Office డాక్యుమెంట్లను బైనరీ డాక్యుమెంట్ ఫార్మాట్ (Office 97-2003: .doc, .xls మొదలైనవి...) నుంచి Open XML ఫార్మాట్‌కు (Office 2007 మరియు ఆపైన... .docx, .xlsx మొదలైనవి...) మార్చడానికి సంబంధించి ఏ మేరకు పొందన ఉందన్న అంశాల్ని అంచనా వేయడానికి OMPM తోడ్పడుతుంది. OMPM 2010తో మేక్రోలకు ఉండే పొంతన, 64 బిట్ Office కంపాటిబిలిటీని అంచనా వేయడానికి అవసరమైన ఫీచర్లను కూడా OMPM 2010 జోడిస్తుంది. ఒకేసారి పలు డాక్యుమెంట్లను బైనరీ నుంచి Open XML ఫార్మాట్‌కు మార్చడానికి వీలుగా ఈ టూల్‌కిట్‌లో Office File Converter (OFC) కూడా ఉంది.
ఈ OMPM టూల్‌ను 2007లోనే Microsoft Office 2007తో విడుదల చేసినందున దీని ఉపయోగాల గురించి కొందరికి తెలిసి ఉండవచ్చు. కాగా, OMPM 2010ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతూ ఇందులో అదనంగా చేర్చిన అంశాలు ఏమిటంటే...
Bulk Macro Compatibility స్కానింగ్: ఆబ్జెక్ట్ మోడల్‌లో మార్పుల కారణంగా తలెత్తే VBA సమస్యలపై దృష్టి సారించేందుకుగాను Office Code Compatibility Inspector (OCCI) నుంచి లాజిక్‌ను పొందుపరచడం.
Bulk 64-bit compatibility స్కానింగ్: 64 బిట్ Office వినియోగం వల్ల తలెత్తే 64 బిట్ (డిక్లేర్) VBA సమస్యలపై దృష్టి సారించేందుకు OCCI నుంచి లాజిక్‌ను పొందుపరచడం. offscan.iniలో చేసిన కొత్త మార్పుతో ఈ స్కాన్ క్రియాశీలం అవుతుంది.
స్కానింగ్‌కు ముందుగానే తేదీ నిర్ణయం: గడచిన తేదీల్లో పరిశీలించిన లేదా చివరిగా మార్పులు చేసిన ఫైళ్ళను మినహాయించేందుకు గాను offscan.iniలో కొత్త సదుపాయాలున్నాయి. వీటిని దాటవేయడం గానీ నమోదు చెయ్యడంగానీ జరుగుతుంది.
SQL 2008/SQL 2008 R2కు మద్దతునిస్తూ SQL 2005తో పొంతనను కలిగి ఉంటుంది.
OMPM, OFCలకు సంబంధించి ఇప్పటివరకూ ఉన్న పలు సమస్యల్ని తాజా విడుదలలో సరిచేశారు. ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు పాత తేదీల ఫైళ్ళకు సంబంధించిన సమస్యలు, OFC కన్వర్షన్ పూర్తికాకపోవడం లాంటివి.
సమస్యలపై త్వరితగతిన మిమ్మల్ని అప్రమత్తం చేసే పలు సహాయక ఉపకరణాలు ఇందులో ఉన్నాయి.