సహజత్వం, సరళత్వాల సమ్మేళనం Share Point
వెబ్ మరియు Microsoft Officeకు సంబంధించి సంప్రదాయంగా కొనసాగే పరస్పర సహకారం, డాక్యుమెంట్ మేనజిమెంట్, సెర్చి మరియు పోర్టల్ సామర్థ్యాలకు మించి మరెంతో విస్తృతమైన అనుభవం Share Point ద్వారా యూజర్లకు లభిస్తుంది. వ్యక్తిగతంగాను, వివిధ బృందాలు, ఇంట్రానెట్ మరియు ఇంటర్నెట్ సైట్ల వెంబడి విస్తృతంగా పనిచేయగల నిర్మాణం కల్గిన Share Point పలు కార్యకలాపాల సాధ్యాసాధ్యాలపై పరిశ్రమలో ఉన్న ఊహాగానాల్ని సవాల్ చేసింది. ప్రస్తుతం వేలాది సంస్థలు ఉపయోగించుకుంటున్న ఈ Share Point, నేటి పరిశ్రమల రంగానికి సహాయకారిగా ప్రధాన భూమికను పోషిస్తున్నది. విస్తారంగా ఉన్న పార్ట్‌నర్ సొల్యూషన్స్ నుంచి మద్దతుతో పలు బిలియన్ డాలర్ల వ్యవస్థను సృష్టిస్తోంది. శక్తిమంతమైన FAST సెర్చి మొదలుకొని అధునాతన Excel వరకూ, Microsoft Dynamics and SAP via Duetతో పాటు Power Pivot Business Intelligence నుంచి నిర్దిష్ట వ్యాపారంలో నైపుణ్యంగల సంస్థల సమగ్రతకు సంబంధించిన ఎన్నో సామర్థ్యాలు Share Point స్వంతం.
http://sharepoint.microsoft.com/blog/Pages/default.aspx
ఒక వ్యవస్థను మరింతగా అభివృద్ధి చేసే క్రమంలో సహజత్వాన్ని, సరళత్వాన్ని సమతూకంలో మేళవించడమే Share Point విజయానికి మూలం. ఈ విధమైన వికేంద్రీకృత మరియు సాధికారపూర్వక విధానం వల్ల కలిగే ఒక ప్రయోజనం ఏమిటంటే, తప్పుల్ని సరిదిద్దడంలోను, మార్పులు చెయ్యడంలోను సిబ్బంది అవరోధాలకు గురికాకుండా ముందుకెళ్ళగల్గుతారు. పలు భాషలు వినియోగంలో ఉండే ఎన్నో దేశాలవారు Share Pointను ఉపయోగించుకోవడంలో ఉన్న ఈ సరళతను ఆస్వాదిస్తున్నారు. కాగా, CMS గుండా పలు విధాల కార్యకలాపాలను సులభశైలిలో పూర్తిచేసుకోవడమన్నది వారి వారి సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానంలేని సిబ్బంది విషయానికే వస్తే కనీస శిక్షణతో.. వెబ్ సిబ్బంది సహకారం అవసరం లేకుండానే వారికి అప్పజెప్పిన విభాగానికి పేజీలను లేదా ఉప-సైట్‌లను జోడించడం వంటి పనుల్ని పూర్తి చేసుకోగలుగుతారు. తద్వారా ఆయా విషయాల్ని సృజనాత్మకంగా సిద్ధం చేసుకుని వెబ్‌లో నిర్దిష్ట పరిధిలోగాని, శాఖాపరంగా గానీ ఉపయోగించవచ్చు.